మనో నిగ్రహం

ప్రశ్న :
ఏ పద్ధతిని – ఏ మార్గాన సాధన చేసినా మనసు ను వశం చేసుకోవాలని చూస్తారు. దాన్ని నిగ్రహించమని చెపుతారు. ఒకవైపున మనసు ఒక తెలియని వ్యక్తిగా – మరొక వైపున తనకు అనేకమైన వ్యవహారిక బాధలు, గొడవలు వుండగా – మనం నిజంగా మనో నిగ్రహం సాధించ గలమా?

సమాధానం:
సముద్రం ఎప్పుడూ చూడని ఒకాయన దాన్ని చూసి తెలుసుకోవడానికి దాని దగ్గరకు వెళ్ళాడు. ఆ విశాల జల రాశి ముందు నిలిచి అందు స్నానం చేయాలని అనుకొన్నాడు. ఆ తీరాన నిలిచి చలించి, ఘోషిస్తున్నట్టి ఆ తరంగాల్ని చూసి “ఈ అలలన్నీ అణిగినప్పుడు ఇంటి వెనక చెరువు లో స్నానం చేసినట్లు – సముద్రం లో దిగి స్నానం చేస్తాను” అనుకున్నాడు.

సముద్రం నిరంతరం అలసట లేకుండా తరంగాలతో సృస్టి మొదటినుంచి, ప్రళయం వరకు ఆవిధంగా చలిస్తూ వుంటుందనే సంగతి ఇతరులు చెప్పడం వల్లగాని, లేదా – తనకు తానుగా తెలుసుకోవడం వల్ల గాని విషయం గ్రహించ వలసి వుంది.

అతడా విషయం తెలుసుకున్న తర్వాత అతడా సముద్రం లో దిగి స్నానం చేస్తాడు. అతడు చేతులు మెల్ల మెల్ల గా వూపుతూ, గత సూచనల ద్వారా ఆ తరంగాలలో మునుగుతూ తన తలపై నించి తరంగాలను పోనిస్తాడు. అతడు శ్వాసను సహజంగా బంధిస్తాడు. అట్లా చేయడం వలన అతడు నేర్పరి అవుతాడు. చివరకి తన లక్ష్యాన్ని సాధిస్తాడు – ఎటువంటి దుఃఖం బాధ కష్టం కలగకుండా.

సముద్రం చలిస్తూ ఉన్నా అతడు దాని బంధం నుండి విముక్తుడు అవుతాడు. “మనస్సు విషయం లో కూడా అంతే”.

భగవాన్ రమణ మహర్షి (100 ప్రశ్నలకు రమణ మహర్షి సమాధానాలు నుంచి)

Advertisements

One Response to “మనో నిగ్రహం”

  1. DRPVSSNRAJU Says:

    Excellent explanation.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s


%d bloggers like this: