Archive for March, 2009

పూర్ణం, శూన్యం, అనంతం

March 24, 2009

ఉన్నది ఒక్కటే – పూర్ణం – సచ్చిదానందం – అద్వయం – ఏకం – 1
లేనిది ఒకటి – శూన్యం – అహంకారం – ఉహ జనితం – 0

ఆ ఉన్న పూర్ణాన్ని ఈ లేని శున్యంతో విభజిస్తే కనిపించేది ఈ అనంత దృశ్య ప్రపంచం!!!
(1/0 = Infinite)

దృగ్ దృశ్యౌ ద్వే పదార్ధౌః స్థః పరస్పర విలక్షణం |
దృగ్ బ్రహ్మ దృశ్యం మాయ ఇతి సర్వ వేదాంత డిండిమః ||

పరా పూజ

March 11, 2009

అఖండే సచ్చిదానందే నిర్వికల్పైకరూపిణి |
స్థితే అద్వితీయ భావే అస్మిన్ కథం పూజా విధీయతే ||

ఆత్మా త్వం, గిరిజా మతిః, సహచరాః ప్రాణాః, శరీరం గృహం,
పూజా తే వివిధొపభొగరచనా, నిద్రా సమాధిస్థితిః,
సంచారః పదయోః ప్రదక్షిణ విధిః, స్తోత్రాణి సర్వాగిరౌ,
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం.

—శ్రీ శంకరాచార్య (పరా పూజ స్తోత్రం నుంచి)

నిజంగా చెప్పాలంటే ధర్మబద్దమైన కర్మలన్నీ ఆరాధనమే.
జ్ఞాని చేసే ప్రతి కర్మా ఈశ్వరారాధనమే.
ఈ పైన చెప్పిన “పరా పూజ” తత్త్వం అర్ధం కాక పోతే
“క్షమ” కోసం కరుణా సముద్రుణ్ణి ఇలాప్రార్ధించాలి:

కర చరణ కృతం వా, కర్మ వాక్కాయజం వా,
శ్రవణ నయనజం వా, మానసం వాపరాధం |
విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో ||

ఇక ఇదీ కుదరని పక్షంలో అమ్మవారికి పూర్తి శరణాగతిని తెలియజేసే మార్గం:

దేవీ! యావత్ప్రపంచంలో నాకు సముడైన పాపి లేడు. నీకు సాటి వచ్చే పాపక్షాళన శక్తి లేదు. దీనిని మనస్సున ఉంచుకుని నీకెలా తోస్తే అలా చేయి!

ఈ విధంగా జ్ఞాన, కర్మ, భక్తి యోగాలు పరిసమాప్తమవుతాయి.

ఈశ్వరార్పణమస్తు

"పద" అరణ్యం – తత్త్వ "మార్గం"

March 4, 2009

శాస్త్ర సంచయంలోని పద సమూహాలు అరణ్యం వంటివి. మనస్సు అందు దారి తెలియక పరిభ్రమిస్తూ ఉంటుంది. అందుచేత తత్త్వజ్ఞుల నుండి ఆత్మ తత్త్వాన్ని ప్రయత్నించి తెలుసుకోవాలి.

— శ్రీ శంకర భగవత్పాదులు, శ్రీ శంకర ఉవాచ నుంచి

ఇతరులకు నినునేరుగతరమా

March 3, 2009

ఇతరులకు నినునేరుగతరమా
ఇతరులకు నినునేరుగతరమా ఇందిరా రమణ
సతత సత్యవ్రతులు సంపూర్ణ మొహవిరహితులేరుంగుదురు నిను ఇందిరా రమణ
ఇతరులకు నినునేరుగతరమా
నారికఠాక్షపటునారాచభయరహిత శూరులేరుగుదురు నిను చూచేటి చూపు
ఘోర సంసార సంకులపరిచ్చేదులగు ధీరులెరుగుదురు నీ దివ్య విగ్రహము
ఇతరులకు నినునేరుగతరమా
రాగభోగవిదూర రంజితాత్ములు మహాభాగులెరుగుదురు నిను ప్రనుతించు విధము
ఆగమోక్త ప్రకారాభిగంయులు మహాయోగులెరుగుదురు నీవుండేటి వునికి 
ఇతరులకు నినునేరుగతరమా
పరమ భాగవత పదపద్మ సేవానిజాభరనులెరుగుదురు నీ పలికేటి పలుకు
పరగు నిత్యానంద పరిపూర్ణ మానసస్తిరులెరుంగుదురు నిని తిరు వెంకటేసా
ఇతరులకు నినునేరుగతరమా
సతత సత్యవ్రతులు సంపూర్ణ మొహవిరహితులేరుంగుదురు నిను ఇందిరా రమణ
ఇతరులకు నినునేరుగతరమా ఇతరులకు నినునేరుగతరమా
 

Oracle Enterprise Manager 10g Release 5

March 3, 2009

The latest release of Oracle Enterprise Manager 10g called Release 5 or OEM 10gR5 released… It is more stable, manageable with new features in overall enterprise management.

నే నేమిటి?

March 2, 2009

నేను శరీరం కంటే భిన్నుడను కనుక జన్మ వార్ధక్య చావు వంటి వికారాలు నాకు లేవు. ఇంద్రియ రహితుడను కనుక శబ్దరసాల వంటి ఇంద్రియవిషయాల పట్ల ఆసక్తి నాకు లేదు.
మనస్సు కంటే భిన్నుడను కనుక దుఃఖం, ఆసక్తి, ద్వేషం, భయాలు నాకు లేవు. ఉపనిషద్ వాక్యం ఇది : అప్రాణొహ్యమనాః శుభ్రోహ్యక్షరాత్పరతః పరః

दिव्यो ह्यमूर्तः पुरुषः स बाह्याभ्यन्तरो ह्यजः ।
अप्राणो ह्यमनाः शुभ्रो ह्यक्षरात् परतः परः

Mundaka Upanishad : ii-1-2