Archive for July, 2011

గురు పరంపర

July 14, 2011

ఓం నారాయణం పద్మభవం వసిష్టం
శక్తిం చ తత్పుత్ర పరాశరం చ
వ్యాసం శుకం గౌడపాదం మహాంతం
గొవింద యోగీంద్ర మధస్య శిష్యం
శ్రీ శంకరాచార్య మధస్య శిష్యం
పద్మ పాదం చ హస్తామలకం చ
తం తొటకం వార్తికకార మన్యాన్
అస్మద్ గురూన్ సంతతం మానతోస్మి

From Hamsa Ashram 2010

— గురు పూర్ణిమ సందర్భంగా (ఆషాఢ శుద్ధ పూర్ణిమ)

Om nArAyaNam padmabhavam vasishTam
Saktim cha tatputra parASaram cha
vyAsam Sukam gowDapAdam mahAntam
govinda yOgIndra madhasya Sishyam
SrI SankarAchArya madhasya Sishyam
padma pAdam cha HastAmalakam cha
tam toTakam vArtika kAra manyAn
asmad gurUn santatam mAnatOsmi

— Guru poornima

Krishna Panchakam:
Sri Krishna and four others, namely Sanatkumara, Sanaka, Sanandana and Sanatsujata consist of Krishna Panchaka. Sri Krishna is placed in the centre and others to the east, south, west and north of Lord Sri Krishna.

Vyasa Panchakam:
Veda Vyasa Bhagavan is placed in the centre. His four disciples namely Sumanthu, Jaimini, Vaisampayana and Paila are placed in the four quarters to the east, south, west and north of Vyasa respectively.

Sankaracharya Panchakam:
Sri Sankara Bhagavadpada is placed in the middle and His four sishyas, namely, Padmapadacharya, Sureswaracharya, Totakacharya and Hastamalakacharya are placed in the four directions.

Let the grace of Jagadgurus be on one and all.

తేనెటీగ – కూడబెట్టుట

July 12, 2011

తల్లిగర్భమునుండి ధనము తేడెవ్వడు
వెళ్లిపోయెడినాడు వెంటరాదు
లక్షాధికారైన లవణ మన్నమె కాని
మెఱుగు బంగారంబు మ్రింగబోడు
విత్త మార్జనజేసి విఱ్ఱవీగుటె కాని
కూడబెట్టిన సొమ్ము తోడరాదు
పొందుగా మఱుగైన భూమిలోపల బెట్టి
దానధర్మము లేక దాచి దాచి

తుదకు దొంగల కిత్తురో దొరల కవునొ
తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు?
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర!

–శేషప్ప కవి విరచిత నరసింహ శతకం నుంచి
http://nonenglishstuff.blogspot.com/2011/05/blog-post_16.html

>SQL Plan Stability

July 10, 2011

>Recently I came across a “performance problem” on Oracle database. A fairly innocent looking insert statement is intermittently taking “hours” to complete.

Problem:
INSERT INTO TARGET_TABLE (“Column List”)
SELECT “values”
FROM SOURCE_TAB1, SOURCE_TAB2, SOURCE_TAB3
WHERE “All necessary join conditions and other conditions”

As the statement performing will in some instances and giving problem only in some cases, I have looked at the plans. It was generating two different plans – one with a simple nested loops and another with a Cartesian Join. When the second execution path is executed, it needed a lot of CPU and memory resources.

When I looked at the source of this query, it is originated in a job which is uploading a set of files into the database. Table stats are collected just before running the job. The development team has tested it several times in their database and they never had a problem with performance even in UAT environment. This behavior is only in the new environment that was built for the purpose of to-be production!

Reason:
As the optimized statistics are highly fluctuating from one file load to another file load, Oracle Database is generating different plans when the query is executed with different bind variables.

Solution:
Plan Stability can be achieved by
1. Importing the statistics from a stable environment and LOCKed.
2. By the way of providing Hints
3. By creating SQL Profiles
4. By generating stored outlines
5. By SQL plan Management (SPM) functionality in 11g.
We took a simple approach of importing and locking the statistics for the intermediate file upload schema to achieve the stability which worked well in the environment. but the most sophisticated SQL Plan Management functionality in 11g can solve most of plan stability issues. See this Oracle TWP – http://www.oracle.com/technetwork/database/focus-areas/bi-datawarehousing/twp-sql-plan-management-11gr2-133099.pdf for more details.

Notes:
As there is no silver bullet, one should be careful in implementing new features. This blog post explains the flip side of SPM and how to be careful with it.

To put it simply, be careful with setting optimizer_capture_sql_plan_baselines to TRUE. One can enable this parameter at a session level and capture the needed baselines and use them to get a consistent performance!

finally, however cleaver the RDBMS engine becomes, it can still commit blunders! an experienced DBA can never be replaced while dealing with performance issues!!

>shaTpadI – షట్పదీ

July 6, 2011

>జగద్గురువుల కవిత్వం
అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణాం
భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః

దివ్యధునీమకరందే పరిమలపరిభోగసచ్చిదానందే
శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్ఛిదే వందే

సత్యపి భేదాపగమే నాథ తవాహం న మామకీనస్త్వం
సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః

ఉద్ధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే
దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః

మత్స్యాదిభిరవతారైరవతారవతాఽవతా సదా వసుధాం
పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోఽహం

దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద
భవజలధిమథనమందర పరమం దరమపనయ త్వం మే

నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ
ఇతి షట్పదీ మదీయే వదనసరోజే సదా వసతు

ఇతి శ్రీమద్ శంకరాచార్యవిరచితం విష్ణుషట్పదీస్తోత్రం సంపూర్ణమ్

నా పైత్యం
హే విష్ణో, అవినయం అపనయ, దమయ మనః, శమయ విషయ మృగతృష్ణాం, భూతదయా విస్తారయ, తారయ సంసార సాగరతః
ఆగంతకముగా నాలోకి వచ్చిన “అవినయము” (అహంకారము, గర్వము)ను పారద్రోలుము. విషయములనే ఎండమావులను శాంతింపజేయుము. మనస్సును కళ్ళెము వేయుము. నాలో కొంచెముగా ఉన్న భూతదయను విస్తరించుము (ప్రతివారికీ తనవారి మీద దయ ఉంటుంది. దాన్ని విస్తరిస్తే వసుధైక కుటుంబమే!) నన్ను ఈ సంసారమనే సా+గరము (గరము అంటే విషము; సాగరము అంటే విషముతో కూడినది అని అర్ధము) నుండి తరింపుము. (నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేవా? అంటే – అదివచ్చి నన్ను పట్టుకుంది, లేదా నేను అందులో పడి పోయాను. అందువలన నాకు ఒక ఆలంబనను లేదా నౌక లాంటి దానిని నీవే ఇవ్వ వలసి ఉంటుంది. )

వందే! శ్రీ పతి పదారవిందే, దివ్య ధునీ మకరందే, పరిమళ పరిభోగ సచ్చిదానందే, భవ భయ ఖేద చ్చిదే
దివ్య ధునీ అయిన మందాకిని అనే మకరందము గలవీ (త్రివిక్రమ లీల) , ఎంత అనుభవించినా తనివితీరని (పరిభోగము నకు అనువైన) పరిమళము గలిగినవీ, ఈ సంసారమందు కలుగు భయమునూ ఖేదమునూ ఛేదించ గలిగినవీ అయిన శ్రీపతి (మనకు అన్ని భోగాలనూ ఇచ్చే భూమి నుంచి వచ్చే సంపదకు “శ్రీ” అని పేరు) పదారవిందములకు నేను వందనము చేయు చున్నాను.

హే నాథ! సత్య అపి బేధ అపగమే తవ అహం న మామకీ నః త్వం; సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః
ఓ నాథా, ” నీవు”, “నేను” అనే బేధం పోయి పరమార్థ సత్యం దర్శనం వరకూ నేను నీయందే ఉన్నాను (తవ అహం) కానీ ఎప్పుడూ నీవు నావాడవు (మాత్రమే) కావు. అది ఎలాగంటే, ఎల్లప్పుడూ తరంగాలన్నీ సముద్రానివే కానీ సముద్రమెప్పుడూ ఏ ఒక్క తరంగానిదీ కాదు కదా!

కిం న భవతి భవ తిరస్కారః ? భవతి దృష్టే ప్రభవతి, హే ఉధృతనగ, నగభిత్ అనుజ, దనుజ కుల అమిత్ర, మిత్ర శశి దృష్టే!
ఓ కొండను ఎత్తిన వాడా (గోవర్ధన ఉద్ధారణ లీల – ఇంద్రుని గర్వం అణచి న సందర్భం) , కొండల శత్రువైన ఇంద్రుని తమ్ముడిగా పుట్టి అన్నకు రాజ్యమిప్పించినవాడా (వామన అవతార లీల) , ఓ రాక్షస కులమునకు శత్రువైన వాడా (రామావతార లీల) ఓ సూర్య చంద్రులు కళ్ళ గా కలిగినవాడా ( ఎల్లప్పుడూ అన్ని జీవులనూ గమనించే వాడా!) నీ కృపా దృష్టి నా మీదకు ప్రభవిస్తే ఈ సంసార తిరస్కారము ఎందుకు జరగదు? (వైరాగ్యం వచ్చి తీరుతుంది అని సమాధానము!!)

హే పరమేశ్వరా! భవతా పరిపాల్యో అహం భవ తాప భీతః; అవతారవతా మత్స్య ఆదిభిః అవతారైః అవతా సదా వసుధాం!

మత్స్యము మొదలైన అవతారాలను ధరించి (చిన్న చేపను కాపాడిన రాజును ప్రళయ కాలం లో కాపాడుతూ, ఎకకాలంలో వేదోద్ధరణం చేసిన లీల) పాప భారం ఎక్కువైపోయిన భూదేవిని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉండే నువ్వు ఓ పరమేశ్వరా నేను కూడా భవ తాపం తో భీతి చెంది ఉన్నానాయ్యా (నాలోనే పుట్టిన పాపపు ఆలోచనలను నిగ్రహించలేకుండా ఉన్నానయ్యా!) నన్నూ అదే విధం గా పరిపాలించ వయ్యా పరమేశ్వరా (పరమేశ్వర అనే నామం శివునకు సంబంధిచినదైనా, శివ కేశవ అబేధం వల్ల ఇక్కడ అన్వయిస్తుంది )

హే దామోదర, గుణమందిర, సుందర వదనారవింద, గొవిందా! భవ జలధి మథన మందర! త్వం మే పరమం దరం అపనయ
ఓ దామోదరా (పరబ్రహ్మమై ఎవరికి చిక్కని వాడివి, యశొదమ్మ చేత చిక్కి దామము లో ఉదరము ను బంధింపబడిన వాడవై – భక్త సులభుడవైన లీల) అన్ని గుణములకూ మందిరమైన వాడా! (తెల్లని సూర్య కాంతి నుంచి సప్త సప్తి మరీచులు లెక్క లేనన్ని రంగులు / గుణములు ఎల వస్తాయో అయినాప్పటికీ సూర్య కాంతి ఎలా నిర్గుణ మైనదో) ఎల్లప్పుడూ చూడాలనిపించే సుందర వదనారవిందము కలవాడా (సౌందర్యం లో రక్షకత్వం ఉంటుంది) ఓ గోవిందా (జగద్గురు తత్త్వం; శంకరాచార్యుల గురు స్వరూపం కూడా గోవిందుడే!) ఈ భవ జలధిని మధించ దానికి మందర పర్వతం లాగా, కవ్వం గా నాకు సహాయం చేస్తున్నవాడా! పరమమైన భయమైన మృత్యు భయమును నానుంచి దూరము చేయవయ్యా! (అంటే జ్ఞానము ప్రసాదించ మని ప్రార్ధన!!)

నారాయణా, కరుణామయా, నీ చరణములయందు శరణడిగిన నా వదన సరోజమునందు ఈ షట్పది (తుమ్మెదను) ఎల్లప్పుడూ నివసించునట్లు చేయి.
(నా మాటలలనే పద్మాలలో భక్తి అనే మకరందాన్ని తుమ్మెద రూపం లో ఎల్లప్పుడూ ఆస్వాదించు స్వామీ; అది నన్ను తరింప జేస్తుంది అని భావము)

— భగవంతుని నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల వలన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనము ద్వారా నేననే ఈ తోలు తిత్తికి గల కర్ణ రంధ్రములలో ప్రవేశించి జగద్గురువు శంకర భగవద్పాదుల వాణి మదీయ గురుచరణుల వైభవాన్ని ఆవిష్కరించింది.

ప్రతి జిజ్ఞాసువూ తన జీవిత కాలం లో ఒక్కసారి భావపూర్వకంగా ఈ స్తొత్రం తో ధ్యానము చేస్తే జీవిత పరమార్థమైన మోక్షం లభించి తీరుతుంది.