జడత్వం ఎక్కడుంది?

భగవత్పాదులు ఆది శంకరులు ఆర్యాంబ గర్భమునదు ఎందుకు ఉదయించారు? అంతటి మహాపురుషునికి జన్మనిచ్చే భాగ్యం కలగడనికి కావలసిన ముఖ్యమైన లక్షణం ఏమిటి? ఈ ప్రశ్నలకి సమాధానం శంకర విజయం లో దొరికింది.

ఆర్యాబ శివగురు దంపతులకు చాలాకాలం సంతాన ప్రాప్తి కలగక పోవడంతో శివగురు చింతిస్తూన్న తరుణంలో ఆర్యాంబ “ఉపమన్యు” వృత్తాంతాన్ని గుర్తుకు తెచ్చి “నో దేవతాసు జడిమా, జడిమా మనుష్యే” అని తన భర్తకు విన్నవిస్తుంది.

ఉపమన్యు వృత్తాంతాన్ని టూకీగా ఇలా చెప్పుకోవచ్చు. ఊపమన్యువు బాల్యంలో తోటి పిల్లలందరూ పాలు తాగి తన బీదరికాన్ని హేళన చేయగా తన తల్లి వద్దకు వచ్చి పాల కొరకు పట్టు పడతాడు. ఆ రోజులలో పేదవారు ఆవులను పెంచలేక పోవటం వలన పాలు సులభంగా లభించేవి కాదు. ఆందువలన ఉపమన్యు ను తల్లి పిండి నీటిలో కలిపి తన పిల్లవానికి పాలుగా ఇచ్చింది. ఉపమన్యువు తాను కూడా పాలు తాగానని తన సహచరులతో చెప్పగా వారు అతను తాగినవి పాలు కావనీ, పిండి నీళ్ళనీ గ్రహించి ఎక్కువ హేళన చేయసాగిరి.

ఉపమన్యు తన తల్లి వద్ద సత్యాన్ని కనుగొని తనకు నిజమైన పాలు లభించడానికి పరమశివునిగూర్చి ఒక శివ ప్రతిమను ఉద్దెశించి శ్రద్ధగా తపస్సు చేయసాగెను.. అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ఉపమన్యుకు క్షీర సముద్రాధిపత్యమునిచ్చెను.

“దేవతలు రాతి విగ్రహములుగా నున్ననూ వానియందు జడత్వము లేదు. దేవతా స్వరూపమును గ్రహింప జాలని మనుష్యునియందే జదత్వము గలదు” అని ఆర్యాబ శివగురు తో విన్నవించగా వారిరువురూ వృషాద్రీశ్వరుణ్ణి గూర్చి తపమొనర్చగా ఈ “ఆస్తిక్యమునకు” మెచ్చిన పరమేశ్వరుడు ఆర్యాంబాశివగురు దంపతులననుగ్రహించి శంకర భగవత్పాదులుగా అవతరించారు.

–వైశాఖ బహుళ చవితి  (ఆస్తిక్యానికి ఎంతొ ప్రాధాన్యతనిచ్చిన మా అమ్మ ను తలుచుకుంటూ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: